Kaaka: గూస్ బంప్స్ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్.. కంటెంట్ లీక్.. వీడియో ఎలా ఉంటుందో?
- October 26, 2026 / 06:57 PM ISTByFilmy Focus Desk
సినిమాలో ఓ ముఖ్యమైన సీన్ గురించి ముందే చెప్పేస్తే.. ఆ సీన్ చూసేటప్పుడు అంత కిక్ రాదు అని అంటుంటారు. కానీ ఆ సీన్ గురించి తెలిసి, ఆ సీన్‌ని చూస్తున్నప్పుడు మేకింగ్, టేకింగ్‌లో మజాతో ఆ సీన్ డబుల్ ఎలివేట్ అయితే.. అదిరిపోతుంది కదూ.. ఇప్పుడు ‘కాకా’ సినిమాకు సంబంధించి అలాంటి అంచనాలు వేసుకునే అవకాశం ఉన్న ఓ సన్నివేశం గురించి చెబుతాం. ఇక సంక్రాంతికి ఆ ఊహలు తెర మీద చూసి ఎంజాయ్ చేసేయండి.
Kaaka
చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘కాకా’. మూడేళ్ల క్రితం ‘వాల్తేరు వీరయ్య’ అంటూ వచ్చి చిరంజీవి కెరీర్‌లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు బాబీ. ఇప్పుడు ‘కాకా’ అంటూ వచ్చే సంక్రాంతికి రాబోతున్నారు. ఆ సినిమా ఎంట్రీ సీన్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆ ఎంట్రీ సీన్ ఉంటుందని చెబుతున్నారు. ఓ స్కూల్‌లో బాంబ్ బ్లాస్ట్ అవుతున్న క్రమంలో, చిరంజీవి ఎంట్రీ ఇచ్చి పిల్లలను రక్షించే సీన్ అదని తెలుస్తోంది.
ఆ సీన్‌లో పిల్లలను రక్షించిన తర్వాత వారితో కలసి చిరు స్కూలు నుండి నడుకుంటూ బయటకు వస్తుంటే టైటిల్ కార్డు పడుతుందని, ఆ పేరుకు కారణం కూడా ఆ సీన్ చెబుతుందని అంటున్నారు. అదేంటి ఇలా చెప్పేశారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఎంత చెప్పినా చిరు, బాబీ ఆ సీన్‌ను తమ స్థాయిలో ఇంకా ఎలివేట్ చేసే తీస్తారు. కాబట్టి ఇప్పటి నుండి ఆ సీన్ గురించి ఊహించుకుంటే సరి.
‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇంటర్వెల్ సీన్ గురించి ఇలానే తొలుత బయటకు విషయం వచ్చేసింది. కానీ ఆ సీన్‌ను బాబీ రూపొందించిన వైనం, చిరంజీవి ఎలివేట్ చేసిన విధానం ఆ సీన్‌ని ది బెస్ట్ అనేలా చేశాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ సంగతి తేలాలంటే జనవరి 13 రావాలి. అప్పుడు ‘కాకా’ వస్తాడు.. విత్ అమ్ములు పాపతో.
















