వినూత్న కథలకు టాలీవుడ్ వేదికవుతోంది. నేటి ప్రేక్షకుల అభిరుచి మేరకు ఫిల్మ్ మేకర్స్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అటువంటి వాటిలో “కల వరం ఆయే” మూవీ ఒకటి. నూతన దర్శకుడు సంపత్ వి కుమార్ డిఫెరెంట్ స్టోరీతో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. 40 సెకన్ల ఈ టీజర్ లో ” మీరందరూ కలలు కంటారు.. నేను వాటిని బయటికి మాట్లాడుతాను” అనే డైలాగ్ తో మూవీపై ఆసక్తిని రేకెత్తించారు.
అలా నిద్రపోతూ కలకంటూ.. ఆ కలని బయటికి చెప్పడం వల్ల అతని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందోనని వెండితెరపై చూసేలా ఈ వీడియో ఆత్రుతని కలిగిస్తోంది. సంజీవ్, ప్రియాంక, చంద్ర మోహన్ తదితరులు నటించిన ఈ “కల వరం ఆయే” త్వరలో రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.