Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

మొన్నీమధ్యనే మనం మాట్లాడుకున్నాం.. తన పాత్ర షూటింగ్‌ లేకపోయినా ‘ఫౌజీ’ సినిమా సెట్‌లో ప్రభాస్‌ అలా ఉండే కంటే.. సెట్స్‌ మీదనే ఉన్న మరో సినిమాకు ఇవ్వొచ్చు కదా అని. అలా సెట్స్‌ మీద ఉన్న ప్రభాస్‌ మరో సినిమానే ‘కల్కి 2’. ఈ సినిమా అప్‌డేట్‌ బయటకు వచ్చిన నేపథ్యంలో మరోసారి ప్రభాస్‌ డేట్స్‌ విషయం చర్చకు వచ్చింది. ఎందుకంటే ఆయన డేట్స్‌ ఇవ్వకే ఇప్పుడు సినిమా షూటింగ్‌ అవ్వడం లేదు. ఇస్తే చేస్తాం అని దర్శకుడు చెప్పారు కాబట్టి. ఆ మాట ఆయన నేరుగా అననప్పటికీ.. ఫైనల్‌ ఆన్సర్‌ అదే అని చెప్పొచ్చు.

Kalki 2

ఇటీవల ఓ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం వచ్చిన ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘కల్కి 2’ సినిమా అప్‌డేట్‌ కూడా చెప్పారు. ‘కల్కి 2’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ పది రోజులు చిత్రీకరణ చేశాం. ప్రభాస్‌ సమయం దొరికాక ఒక పెద్ద షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తాం అని చెప్పారు. ‘అదేంటి.. కీలక షెడ్యూల్‌ అయిపోయింది అని అన్నారు కదా’ అని ఇక్కడ మీకు డౌట్‌ రావొచ్చు. అవును ఆ మాటలు అయితే బయటకు వచ్చాయి. కానీ అవి నిజం కావు అని ఇప్పుడు నాగీ మాటల ద్వారా తేలింది.

ఆయన మాటల ప్రకారం చూస్తే.. ‘కల్కి 2’ సినిమా షెడ్యూల్‌ ప్రస్తుతం ప్రభాస్‌ కోసం ఆగింది. ఆయన ‘ఫౌజీ’ సినిమా పనులు పూర్తి చేస్తే కానీ ఈ సినిమాకు వచ్చేలా లేడు. మరోవైపు ప్రభాస్‌ డేట్స్‌ ఓకే చేస్తే.. అటు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ డేట్స్‌ కూడా చూసుకోవాలి. కాబట్టి ప్రభాస్‌ ‘ఫౌజీ’ పనులు అయినా పూర్తి చేయాలి. లేదంటే అక్కడ సీన్స్‌ లేని రోజులు ఈ సినిమాకు ఇవ్వాలి. చూద్దాం డార్లింగ్‌ ఏం ఆలోచిస్తున్నాడో? అన్నట్లు ‘కల్కి 2’ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి రిలీజ్‌ డేట్‌లు లాక్‌ చేయలేదు. కాబట్టి డేట్‌ కండిషన్‌ లేనట్లే.

‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus