‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD).. ట్రైలర్ రిలీజ్ కి ముందు బజ్ తక్కువగానే ఉండేది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన పాటలు వంటివి ఏమీ బయటకు రాలేదు కాబట్టి. ప్రమోషనల్ కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాదు అని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రిలీజ్ ట్రైలర్ అయితే.. ఆ అంచనాలను డబుల్ చేసింది అనే చెప్పాలి. అయితే తెలుగులో ప్రమోషన్స్ ఏమీ నిర్వహించలేదు.
అది కూడా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతుందేమో అని అంతా భావించారు. మొత్తానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కల్కి. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే.. నార్త్ లో కల్కి ఓ రేంజ్లో దూసుకుపోతుంది. ముందుగా ఈ సినిమాకు రూ.12 కోట్లు నెట్ రావడం ఎక్కువ అని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
కానీ ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే.. ‘కల్కి..’ మొదటి రోజు హిందీలో రూ.20 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , దీపికా పదుకోనె (Deepika Padukone) వంటి బాలీవుడ్ స్టార్స్ నటించడంతో .. ‘కల్కి 2898 ad’ కి కలిసొచ్చినట్టు స్పష్టమవుతుంది. మరి అంతకు మించి మొదటిరోజు ‘కల్కి..’ కలెక్ట్ చేస్తే గ్రేట్ అనే చెప్పాలి.