Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

కథ, మాటల రచయితలు దర్శకులుగా మారడం టాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇలా కన్వర్ట్‌ అవుతూనే ఉన్నారు. ఆ మాటకొస్తే ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ దర్శకులుగా వెలుగొందుతున్న వాళ్లు దాదాపు రచయితలే. రచయిత కాని దర్శకుడు మెల్లగా సైలెంట్‌ అయిపోతున్నాడు. అయితే పాటల రచయిత సినిమా దర్శకుడు కావడం అరుదు. అలా అయిన వారికి విజయాలు లేవు కూడా. అలా ఇప్పుడు అలా మరో దర్శకుడు మెగా ఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతున్నారు.

Kalyan Chakravarthy

పాటల రచయితగా ఆయనకు స్పెషల్‌ పేరు ఉంది. దీంతో ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి సినిమా చేస్తారు అనేదే ఆసక్తికరమైన విషయమే. ఆయనే ప్రముఖ రచయిత త్రిపురనేని కల్యాణ చక్రవర్తి. అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ ‘అల వైకుంఠ‌పుర‌ములో’… నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ‘అఖండ’, ‘అఖండ 2: తాండవం’ తదితర చిత్రాల‌కు ప‌ని చేసిన ర‌చ‌యిత త్రిపురనేని క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి ఇప్పుడు కెప్టెన్‌ కుర్చీలో కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

కల్యాణ్‌ చక్రవర్తి రాసిన పాట‌లు పాపుల‌ర్ అయ్యాయి. పొలిటిక‌ల్ పార్టీల‌కు కూడా ఆయన గీతాలు రాశారు. మాట‌లు, స్క్రిప్టు వ‌ర్క్ కూడా చేస్తారు. ఆయన ఇప్పుడు ఓ యువ హీరో కోసం ఓ క‌థ సిద్ధం చేశారట. మార్చి తొలి వారం నుండి సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ కాకుండానా అనుకుంటున్నారా? ఒకట్రెండు రోజుల్లో అదీ అయిపోతుందని సమాచారం. కల్యాణ్‌ చక్రవర్తి సినిమాలో హీరో తన పేరుతోనే ఉన్న వాడే అని సమాచారం.

ఆ హీరోనే క‌ల్యాణ్ రామ్ అని అంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్‌ కోసం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆయన కాకుండా అదే కుటుంబానికి చెందిన హీరో ఇంకొకరు అని ఇప్పుడు అంటున్నారు. గతంలో ఆ హీరో ఎంట్రీ సినిమా అనౌన్స్‌ అయి ఆగిపోయింది. మరి ఆ హీరో అయిన ఆ హీరో తండ్రి ఈ కథను ఓకే చేశారా లేదా చూడాలి.

 ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus