Kalayan Ram, Jr NTR: ఆ వార్తల్లో నిజం లేదన్న కళ్యాణ్ రామ్.. కానీ?

Advertisement

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉంది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే బింబిసార2 సినిమాలో తారక్ నటిస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార2 లో తారక్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

అందరిలా నేను చందమామ కథలను వింటూ చదువుతూ పెరిగానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలను చూసి తాను ఆనందించేవాడినని ఆయన అన్నారు. సోషియో ఫాంటసీ సినిమాలలో నటించే ఛాన్స్ నాకు కూడా వస్తే బాగుంటుందని నేను అనుకునేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. నా కలను నిజం చేసిన డైరెక్ట వశిష్టకు కృతజ్ఞతలు అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ప్రొడ్యూసర్ హరి ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను ఓ రేంజ్ లో రూపొందించారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. అద్భుతమైన టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారని కళ్యాణ్ రామ్ తెలిపారు. బింబిసార కథను రెండు భాగాలలో చెప్పాలని ముందే అనుకున్నామని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి ఒకటి కంటే ఎక్కువ సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నామని కళ్యాణ్ రామ్ తెలిపారు.

బింబిసార టీజర్ రిలీజైన సమయంలో కొంతమంది మగధీర సినిమాతో మరి కొందరు బాహుబలి సినిమాతో పోల్చారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. బింబిసార మూవీని గొప్ప సినిమాలతో పోల్చడం సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. తెలుగు వాళ్లకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమానే అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus