కుటుంబసభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న కళ్యాణ్ రామ్

  • July 6, 2018 / 06:35 AM IST

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ చిన్నవయసములోనే నిర్మాతగా మారి జయాపజయాలను చూసారు. హీరోగానూ మెప్పిస్తున్నారు. రీసెంట్‌గా అతను నటించిన “నా నువ్వే” చిత్రం యువతీయువకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తన 16వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కెవి గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న మూవీ ఫస్ట్ లుక్ కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నిన్న ఉదయం నుంచి కళ్యాణ్ రామ్ కి అభిమానులు బర్త్ డే విషెష్ చెప్పారు. పలు కార్యక్రమాలు జరిపారు.

సాయంత్రం కళ్యాణ్ రామ్ తన పుట్టినరోజు వేడుకను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, అతని పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా పాల్గొన్నారు. తమ్ముడు ఎన్టీఆర్ అన్నకళ్యాణ్ రామ్ కి కేక్ తినిపిస్తున్న ఫోటో చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక అభయ్ రామ్ తన పెదనాన్న కళ్యాణ్ రామ్ తో ఆడుకోవడం ఫ్యాన్స్ సంతోషాన్ని రెట్టింపు చేశాయి. వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus