ఫ్లాపొచ్చినా అదే పాత్రను పోషించనున్న కళ్యాణ్ రామ్

  • June 30, 2018 / 06:52 AM IST

సాధారణంగా మన కథానాయకులు ఒకసారి ఫ్లాపైన పాత్రను పోషించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అప్పట్లో “ఎస్.పి పరశురామ్” ఫ్లాప్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడప్పుడే పోలీస్ పాత్రలు చేయాలనుకోవడం లేదని చెప్పారట కొందరు నిర్మాతలకు. అయితే.. కళ్యాణ్ రామ్ మాత్రం ధైర్యం చేసి ఒకసారి పోషించగా ఫ్లాపైన పాత్రను మరోమారు పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెమెరామెన్ టర్నడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. కళ్యాణ్ రీసెంట్ డిజాస్టర్ “ఇజమ్”లోనూ జర్నలిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే.. “ఎమ్మెల్యే”తో ఓ మోస్తరు హిట్ అందుకొని పర్వాలేదనిపించుకొన్న కళ్యామ్ రామ్ ను మొన్న వచ్చిన “నా నువ్వే” దారుణంగా నిరాశపరచడంతో కళ్యాణ్ రామ్ కె.వి.గుహన్ ప్రొజెక్ట్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకొన్నాడు. మరి ఈ సినిమా అయినా మనోడి ఆశలు నిలుపుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus