Bimbisara: కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరనుందా?

  • July 29, 2022 / 05:22 PM IST

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ వచ్చే శుక్రవారం రోజున థియేటర్లలో విడుదల కానుంది. నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరో స్టేటస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హక్కులను దిల్ రాజు తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు బింబిసార మూవీ అద్భుతంగా ఉందని చెప్పడంతో నందమూరి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉందని సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయని సెన్సార్ సభ్యులు వెల్లడిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు పేర్కొన్నారు.

సెన్సార్ సభ్యుల టాక్ పాజిటివ్ గా ఉండటంతో కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ చేరినట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బింబిసార సినిమాకు డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయని చిన్న పిల్లలను సైతం మెప్పించే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ ఖాతాలో నిర్మాతగా కూడా సక్సెస్ చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తుండటంతో ఈ సినిమా సక్సెస్ సాధించాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. జులై నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఆగష్టు తొలి వారంలో విడుదలవుతున్న బింబిసార, సీతారామం సక్సెస్ సాధిస్తాయని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఆగష్టు నెలలో రిలీజయ్యే సినిమాలు నిర్మాతలకు లాభాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus