ఈ నెల 20న తెరపైకి రానున్న ‘ఇజం’

  • October 3, 2016 / 10:26 AM IST

పూరి అంటేనే స్పీడ్ కి మరో రూపం. ఎన్ని ఎలా ఉన్నా పూరి నుండి ఏడాదికి సగటున మూడు సినిమాలు తెరమీదికి రావాల్సిందే. ఇక ఆయన శైలి, పాత్రల చిత్రణ ప్రేక్షకులకు తెలియంది కాదు. అందుకే ఓ సినిమా ఫలితం కాస్త అటుఇటైనా ఆయన సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. అయితే లోఫర్ తర్వాత పూరి సినిమా రిలీజ్ అవడానికి ఈసారి కాస్త ఆలస్యం అయింది. రోగ్ సినిమా విడుదల కాకపోవడమే ఇందుకు గల కారణం. అయితే ఆలోటు ‘ఇజం’తో తీరిపోనుంది.

కళ్యాణ్ రామ్ ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ పూరి తెరకెక్కించిన చిత్రం ‘ఇజం’. ఈ సినిమా టైటిల్, కళ్యాణ్ రామ్ లుక్ అన్ని సినిమాపై అంచనాలను పెంచేశాయి. తొలుత దసరా అని ప్రకటించడంతో సంబరాలు రెట్టింపవుతాయనుకున్నా తర్వాత సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 20న ‘ఇజం’ను విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుందట. ఈ మేరకు అక్టోబర్ 5న ఆడియో విడుదల చేయనున్నారు. టెంపర్ తర్వాత అనూప్-పూరి ఈ సినిమాకి కలిసి చేస్తుండగా పూరి ఆస్థాన గేయ రచయిత ఈ సినిమాలో 4 పాటలు రాయగా ‘ఇజం’ అంటూ సాగె టైటిల్ గీతానికి పూరి స్వయంగా కలం కదిలించడం విశేషం. బిజినెస్ మేన్ సినిమా కోసం మహేశ్ తో ఓమాట కలిపిన పూరి ఈ సినిమాలో రెండు పాటలు పాడారు. సామాజికాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus