ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) తెలుగువారిని హలో అంటూ పలకరించింది. అక్కినేని అఖిల్ కి జోడిగా నటించి మంచి పేరు అందుకుంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. 40 ఏళ్ల శర్వానంద్ పక్కన జోడీగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. అలాగే రెండో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి కనిపించనుంది. ఈ షూటింగ్ ను విశాఖలో ప్రారంభించారు. ఆ తర్వాత షెడ్యూల్ కాకినాడ పోర్టులో జరగనుంది. ఈ చిత్ర పనుల్లో బిజీగా ఉన్న కళ్యాణిని ఓ వార్త కలవరపెట్టింది.
ప్రముఖ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తో కలిసి కళ్యాణి సినిమా చేయనుందని.. నిన్న సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ వెబ్ సైట్లు ఈ వార్తను పోస్ట్ చేశాయి. వీటిని చదివిన కళ్యాణికి కోపంవచ్చింది. వెంటనే స్పందించింది. “ఈ రూమర్లు ఎలా పుడుతాయో.. ఎక్కడి నుంచి వస్తాయో అర్ధం కావడం లేదు. ప్రణవ్ మోహన్ లాల్ తో కలిసి నటించడం నాకు సంతోషమే. కానీ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఆ వార్తల్లో నిజం లేదు” అని స్పష్టం చేశారు.