అభిమానుల అత్యుత్సాహం.. హీరో కాలికి గాయం!
- March 22, 2021 / 12:13 PM ISTByFilmy Focus
సినిమా వాళ్లంటే జనాలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందంటే.. వెంటనే అక్కడ వాలిపోతారు. తమ అభిమాన నటులతో ఫోటోలు దిగాలని, వారిని ముట్టుకోవాలని తహతహలాడిపోతుంటారు. కానీ ఒక్కోసారి వీరి అత్యుత్సాహం కారణంగా తారలు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఓ చేదు అనుభవమే స్టార్ హీరో కమల్ హాసన్ కి ఎదురైంది. తమిళనాడు ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ నుంచి కమల్ పోటీ చేస్తున్నాడు.
దీంతో ప్రచారం జోరుగా చేస్తున్నారు. తను పోటీ చేస్తోన్న కోయంబత్తూర్ లో ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాడు కమల్. ఈ క్రమంలో కోయంబత్తూర్ లో శనివారం నాడు మార్నింగ్ వాక్ కు వెళ్లి అక్కడ స్థానికులను పలకరించాడు కమల్. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో కమల్ ను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో కమల్ అందరితో ఓపికగా సెల్ఫీలు దిగుతున్న సమయంలో.. తోపులాట జరిగింది.

అప్పుడు కమల్ కుడి కాలిని ఓ అభిమాని తొక్కేశాడు. దీంతో కమల్ విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఎక్స్ రే తీశారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో కమల్ కుడి కాలికి ఇన్ఫెక్షన్ రావడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు అదే కాలిని అభిమాని తొక్కడంతో కమల్ విలవిల్లాడిపోయాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హాస్పిటల్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!













