‘ఇండియన్2’ కంటే ‘విక్రమ్’ పైనే ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా ఉందిగా..!

గతేడాది ‘ఖైదీ’ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజన్.. తరువాత విజయ్ తో ‘మాష్టర్’ వంటి భారీ చిత్రాన్ని చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది.. కానీ దాని గురించి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా.. తన నెక్స్ట్ ప్రాజెక్టుని కమల్ హాసన్ తో చెయ్యబోతున్నట్టు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు కమల్ హాసన్.

ఈరోజు కమల్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం టైటిల్ ను రివీల్ చేస్తూ టీజర్ ను విడుదల చేశారు. క‌మ‌ల్ హాసన్ చాలా రోజుల తరువాత అభిమానులను మెప్పించే సినిమాని చేస్తున్నట్టు ఈ టీజర్ స్పష్టం చేసింది. ఇక ఈ టీజర్ ను పరిశీలిస్తే.. ఓ హిల్ స్టేష‌న్లో ఉంటున్న కమల్… అతిథుల కోసం వంట సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తాడు. మ‌రోవైపు వారిపై దాడి చేసేందుకు ఆయుధాలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు.

కమల్ ఎదురుచూస్తున్న వాళ్ళు వచ్చాక… వంట‌లు వ‌డ్డించి, ఆయుధాలు బ‌య‌టికి తీస్తాడు. అక్కడికి టైటిల్ పడుతుంది. క‌మ‌ల్ హసనే ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. అనిరుథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. టీజర్ కచ్చితంగా ఆకట్టునే విధంగానే ఉందని చెప్పొచ్చు. ‘ఇండియన్2’ పై ఉన్న హైప్ మొత్తం ఇప్పుడు ‘విక్రమ్’ పైకి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు.


‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus