15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

‘గణేష్’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి ఫ్లాప్స్ తర్వాత రామ్ హీరోగా వచ్చిన చిత్రం ‘కందిరీగ’. అప్పటి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. సోనూసూద్, అక్ష కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు కాబట్టి.. అందులోనూ రామ్ వరుస ఫ్లాప్స్ తో  ఉండటం వల్ల.. మొదట ‘కందిరీగ’ పై పెద్దగా అంచనాలు లేవు. ఇప్పటి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ‘కందిరీగ’ చిత్రానికి రైటర్ గా పనిచేశారు అనే సంగతి చాలా మందికి తెలీకపోవచ్చు.

Kandireega Collections

బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా 2011 ఆగస్టు 12న విడుదలైంది. మొదటి షోతోనే హిట్ టాక్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించింది. ఈ ఆగస్టు 12తో ‘కందిరీగ’ విడుదలై 14 ఏళ్ళు పూర్తి కావస్తోన్న నేపధ్యంలో టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.42 cr
సీడెడ్ 2.97 cr
ఉత్తరాంధ్ర 1.42 cr
ఈస్ట్ 1.03 cr
వెస్ట్ 0.98 cr
గుంటూరు 1.35 cr
కృష్ణా 1.12 cr
నెల్లూరు 0.57 cr
ఏపీ+తెలంగాణ 15.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.77 cr
ఓవర్సీస్ 0.61 cr
వరల్డ్ టోటల్ 18.24 cr (షేర్)

 

‘కందిరీగ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.9.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.18.24 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి…బయ్యర్లకు రూ.8.84 కోట్ల లాభాలు అందించింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు ‘దూకుడు’ వచ్చే వరకు ‘కందిరీక’ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.

లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus