ప్రోస్తెటిక్ మేకప్ సౌత్ ఇండస్ట్రీకి కొత్త కాదు. కమల్ హాసన్, విక్రమ్ ల పుణ్యమా అని ఇప్పటికే చాలాసార్లు ఆ ప్రోస్తెటిక్ మేకప్ ఎలా ఉంటుంది అనేది చూసేసాం. అయితే.. మొన్న విడుదలైన “తలైవి” ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.. టీజర్ కానీ.. ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా జయలలితలా కంగనాను చూపించడం కోసం ఆమెకు వేసిన ప్రోస్తెటిక్ మేకప్ మరీ గలీజుగా ఉంది. షాపింగ్ మాల్స్ ముందు ఛోటా భీమ్ కాస్ట్యూమ్ వేసుకొని నిల్చోనే కుర్రాలను తలపించిందని “తలైవి” ఫస్ట్ లుక్ కు దారుణమైన ఫీడ్ బ్యాక్ వచ్చిన విషయం తెలిసిందే.
కంగనా & టీం ఆ ఫీడ్ బ్యాక్ ను కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లున్నారు. నేడు జయలలిత జయంతి సందర్భంగా “తలైవి” సినిమాలోని కంగనా తాజా లుక్ ను విడుదల చేశారు. ఈసారి ప్రోస్తెటిక్ మేకప్ జోలికి పోకుండా.. రెగ్యులర్ లుక్ లోనే కాస్త జయలలిత యంగర్ వెర్షన్ గా కనిపించిన కంగనా లుక్ ఆకట్టుకుంటోంది. దాంతో తలైవి టీం తాము చేసిన తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవడం మంచి పరిణామమే అనుకొంటున్నారు సినీ జనాలు.