కంగన రనౌత్…. బాలీవుడ్లో ఇప్పుడో ఫైర్ బ్రాండ్. ఏ విషయమైనా తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంది. ఆ విషయం వెనుక ఇండస్ట్రీ పెద్దలు ఉన్నా, రాజకీయ నాయకులున్నా ఆమె స్పందనలో ఎలాంటి మార్పు ఉండదు. అలా ఇటీవల కాలంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, డ్రగ్స్, నెపోటిజం అంశాలపై స్పందిస్తోంది. హృతిక్‌తో ఆమె వ్యవహారం ఎలాగూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తొలి సినిమా ‘గ్యాంగ్‌స్టర్’కు దర్శకత్వం వహించిన అనురాగ్ బసు ఆమె గురించి స్పందించారు.
‘‘దాదాపు 25 మంది అమ్మాయిలు ‘గ్యాంగ్‌స్టర్’ ఆడిషన్లో పాల్గొన్నారు. అందరిలో కంగన మాత్రమే నా సినిమాలోని పాత్రకు సెట్ అవుతందని అనిపించింది. కంగన డిఫరెంట్ పర్సన్. ఇండస్ట్రీకి కొత్త కాబట్టి… ఏ అనుమానాలున్నా అడిగి తెలుసుకునేది. అంతేకాదు ఆమె ఏక సంథాగ్రహి. ఏదైనా త్వరగా పట్టేస్తుంది. సినిమా చిత్రీకరణ సమయంలోనే కంగన గొప్ప పేరు తెచ్చుకుంటుంది అనిపించింది’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు అనురాగ్ బసు.
‘‘మేమిద్దరం పెద్దగా కలుసుకోం. ఎప్పుడైనా కలిస్తే సరదాగా మాట్లాడుతుంది. అయితే పర్సనల్‌గా నాకు తెలిసిన కంగన… ఇప్పుడు చూస్తున్న కంగన ఒకటి కాదు. ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. చేసే పనిలో, మాటలో కొత్తగా ఉంటోంది. నాకు తెలిసి ఇద్దరు కంగనా రనౌత్‌లు ఉన్నట్లున్నారు. అందులో ఒకరి గురించి మాత్రమే నాకు తెలుసు. ఆ రెండో కంగనా రనౌత్ నాకు అస్సలు అర్థం కావడం లేదు’’ అంటూ సెటైరికల్‌గా మాట్లాడాడు అనురాగ్ బసు.