బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరియు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ హత్యపై ఆక్రోశం వెళ్లగక్కారు. సుశాంత్ డి ఆత్మహత్య కాదు ఇది ప్రణాళికా బద్దంగా జరిగిన ఓ హత్య అని బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు.ఎటుంటి నేపధ్యం లేకుండా ఎదుగుతున్న సుశాంత్ పట్ల బాలీవుడ్ ప్రముఖులు వివక్షత చూపారని ఆరోపించారు. అలాగే సుశాంత్ ఆత్మహత్యకు అతని బలహీనమైన మనసు కారణం అని రాస్తున్న మీడియాపై ఆమె ఫైర్ అయ్యారు.
మానసిక సమస్యతో బాధపడుతున్న వారికి మీడియా రాతలు వారికి ఊరటను ఇచ్చేవిగా ఉండాలి కానీ.. వారి సమస్యను మరింత పెంచేవిగా ఉండకూడదని ఆమె మీడియాపై సైతం విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ర్యాంక్ సాధించిన ఓ ఉత్తమ విద్యార్థి మైండ్ బలహీనంగా ఉంటుందని ఎలా అనుకుంటారు?..అని ఎదురు ప్రశ్నించారు. గతంలో కూడా సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నాడంటూ వార్తలు రాశారు. సంజయ్ దత్ డ్రగ్స్ వాడితే మీకు అది క్యూట్ గా కనిపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. మంచి చిత్రాలలో నటించిన సుశాంత్ కి ఎవరూ ప్రోత్సహం ఇవ్వలేదు అన్నారు.
కై పో చే మూవీకి ఒక్క అవార్డు ఇవ్వని వీరు… చెత్త మూవీ గల్లీ బాయ్ కి అవార్డుల పంట పండించారు. తన చిత్రాలను కూడా గుర్తించడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణానినికి కారణం, అతను పనికిరాడని అనుకున్న వాళ్ళను నమ్మడమే అని కంగనా చెప్పారు. మొత్తంగా బాలీవుడ్ లో బంధు ప్రీతీ ఎక్కువైంది. పాతుకుపోయిన కొన్ని కుటుంబాలు మిగతా వారిని ఎదగనివ్వకుండా అణగదొక్కుతున్నారు అని ఆమె కోప్పడ్డారు. కంగనా రనౌత్ చాల కాలంగా కరణ్ జోహార్, కపూర్, ఖాన్ ల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ అనేక విమర్శలు చేశారు.