బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హైదరాబాద్ లో దర్శనం ఇచ్చారు. ఓ మూవీ షూటింగ్ కోసం ఆమె ఇక్కడకు రావడం జరిగింది. కంగనా రనౌత్ దాదాపు రెండు వారాలు హైదరాబాద్ లో ఉంటారని తెలుస్తుంది. దివంగత నేత, నటి జయలలిత బయోపిక్ తలైవి లో కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుత షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు.
కంగనా జయలలితగా నటిస్తుండగా కె ఎల్ విజయ్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్స్ నిర్మాతగా ఉన్న విషువర్ధన్ ఇందూరి నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా పలుభాషలలో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మధ్య హైదరాబాద్ చేరిన కంగనాను పటిష్ట భద్రత మధ్య హోటల్ కి చేర్చినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ పై తీవ్ర డ్రగ్స్ ఆరోపణలు చేసిన కంగనా రనౌత్ మహారాష్ట్ర సర్కారుతో వివాదం పెట్టుకున్నారు. మహా సర్కారు ముంబైలోని కంగనా కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేశారు. కోర్ట్ ఆదేశాలతో పూర్తిగా నేల మట్టం చేయకుండా ఆపారు. ఇక తన ఆస్థికి నష్టం చేకూర్చిన కారణంగా 2 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ కంగనా పిటీషన్ వేశారు. మహా సర్కారుకు మరియు కంగనా మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఆమె ముంబై వీడి సొంత నగరం మనాలి వెళ్లిపోయారు.