నువ్ కంగనాకు అంకుల్ అయ్యేవాడివి!

  • October 5, 2017 / 09:29 AM IST

బాలీవుడ్ హాట్ పెయిర్ హృతిక్ రోషన్-కంగనా రనౌత్ ల నడుమ జరుగుతున్న రచ్చను కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఈ గొడవ సద్దుమణిగి ఇరువర్గాల వారు సైలెంట్ అవుతున్న తరుణంలో కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ మళ్ళీ రచ్చ మొదలెట్టింది. అసలు ఎందుకు రైజ్ అయ్యిందో కారణమేంటో తెలియదు కానీ.. ట్విట్టర్ సాక్షిగా హృతిక్ రోషన్ బూతులు తిట్టడం తప్ప అన్నీ చేసేసింది.

“నువ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కంగనా స్కూల్ చదువుతోంది, తాను గనుక సినిమాల్లోకి రాకపోయి ఉంటే నువ్ ఆమెకు అంకుల్ వి అయ్యేవాడివి. అలాంటిది తాను వద్దంటున్నా తన వెంబడి ప్రేమ అంటూ ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాక ఇప్పుడు ఆమెను రోడ్డుకీడుస్తున్నావ్. అంతేలే అంతకు మించి నువ్వు ఏం చేయగలవ్” అంటూ ట్విట్టర్ లో హృతిక్ రోషన్ ను చెడామడా తిట్టేసింది. మరి హృతిక్ రోషన్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఏమైనా ట్వీట్ చేస్తాడా లేక సైలెంట్ గా ఉండిపోతాడా అనేది హృతిక్ నిర్ణయానికి వదిలేద్దాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus