Kanguva: సూర్య ‘కంగువా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

  • November 14, 2024 / 05:14 PM IST

సూర్య (Suriya)  హీరోగా ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కంగువా(Kanguva) . దిశ పఠాని (Disha Patani)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్… వంటివి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కంగువాకి బిజినెస్ చాలా బాగా జరిగింది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

Kanguva

ఆంధ్ర లో యూవీ సంస్థ రిలీజ్ చేస్తుంది. ట్రేడ్ లో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో ఒకసారి చూడండి:

నైజాం 6.00 cr
సీడెడ్ 1.50 cr
ఉత్తరాంధ్ర 2.00 cr
ఈస్ట్ 0.80 cr
వెస్ట్ 0.50 cr
గుంటూరు 0.80 cr
కృష్ణా 1.00 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.00 cr

‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ టార్గెట్ చాలా పెద్దది. టాక్ బాగుంటేనే ఓపెనింగ్స్ స్టెడీగా వస్తాయి. లేదు అంటే బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.

నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus