‘సినిమా చూపిస్త మామ, నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేస్తున్న రామ్, ఆ సినిమాతో తన ట్రాక్ రికార్డ్ ను మార్చుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. “ఉన్నది ఒకటే జిందగీ” చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్గా ఓ కన్నడ బ్యూటీని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ పాత్రకు మెహరీన్ ను తీసుకున్నారన్న టాక్ వినిపించింది.
తాజాగా మెహరీన్ స్థానంలో రష్మిక మందనను తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాండల్ వుడ్ సూపర్ హిట్ “కిర్రిక్ పార్టీ”తో అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక ప్రస్తుతం తెలుగులో నాగశౌర్య సరసన “ఛలో” మరియు విజయదేవరకొండతో ఒక సినిమా చేస్తున్న రష్మికను ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారట. తన తొలి చిత్ర దర్శకుడు రక్షిత్ శెట్టితో ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకొన్న రష్మిక కన్నడతోపాటు తెలుగులోనూ కొనసాగిస్తున్న హవా చూస్తుంటే.. పెళ్ళైన తర్వాత కూడా అమ్మడు సినిమాలకి స్వస్తి పలికే అవకాశం లేనట్లేనాని స్పష్టమవుతోంది.