Yash: పుట్టినరోజు అంటేనే భయం వేస్తుంది!: యశ్

Advertisement

కన్నడ స్టార్ హీరో రాఖీ బాయ్ యశ్ జనవరి 8వ తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక స్టార్ హీరో పుట్టినరోజు వేడుకలు అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టడం బైక్ ర్యాలీ చేయడం అలాగే కొన్ని సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు హీరోల పుట్టినరోజు వేడుకలు చేస్తున్నటువంటి తరుణంలో అపశృతి చోటుచేసుకుని అభిమానులు మరణిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే యశ్ పుట్టినరోజు సందర్భంగా ఒకే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు కరెంట్ షాక్ తో మరణించారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా 25 అడుగుల ఎత్తులో బ్యానర్ ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో కరెంట్ షాక్ కొట్టడంతో ఈ ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి యశ్ ఎంతో విచారం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తన (Yash) అభిమానులు మరణించడంతో ఈయన ఆ గ్రామానికి వెళ్లి మృతి చెందిన అభిమానులకు నివాళులు అర్పించడమే కాకుండా వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఈయన మాట్లాడుతూ బ్యానర్లు కట్టి అభిమానాన్ని చాటుకోవడం నాకు ఇష్టముండదు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున ఇలాంటివి జరిగితే.. నాకు పుట్టినరోజు అంటే భయం వేస్తుంది.

నిజానికి పుట్టినరోజు ఇలాంటి పనులు చేయడం నాకు ఏమాత్రం నచ్చదని దయచేసి ఎవరూ కూడా పుట్టినరోజు సమయంలో బ్యానర్లు కట్టి బైక్ ర్యాలీలు చేయడం వంటివి చేయొద్దు అని తెలిపారు వీలైతే మంచి పనులు చేయండి. మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి దిక్కెవరు అంటూ ఈయన ప్రశ్నించారు. ఇకపై ఏ ఒక్క అభిమాని కూడా ఇలాంటి వేడుకలు చేయవద్దు అంటూ ఈయన అభిమానులను కోరారు అయితే మరణించిన ఈ ముగ్గురు అభిమానులు లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన వారని తెలుస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags