Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

‘అఖండ 2: తాండవం’ సినిమా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ తర్వాత ఎప్పటిలా హీరో నందమూరి బాలకృష్ణ ఇంకో సినమా మొదలెట్టేశారు. డైరక్టర్‌ బోయపాటి శ్రీను మాత్రం హీరో కోసం వెతుకుతూనే ఉన్నారు. టాలీవుడ్‌లో ఇది సహజం అనుకోండి. ఈ క్రమంలో బోయపాటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కొంతమంది కథలు చెప్పి ఓకే చేసుకుందాం అనుకున్నా.. అందరూ అప్పటికే ఓకే చేసిన ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారని తేలింది. దీంతో పక్క పరిశ్రమలవైపు ఆయన చూస్తున్నారు అని తెలిసింది.

Suriya – Boyapati

ఈ క్రమంలో బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌తో ‘జాట్‌ 2’ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. మరోవైపు కోలీవుడ్‌ ‘ది వన్‌’ సూర్య దగ్గరకు కూడా ఓ కథతో వెళ్లారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటిలో ఏదీ ఇంకా ఓకే కాలేదు. ఏ సినిమా కూడా అధికారికంగా అనౌన్స్‌ కాలేదు. అయితే సూర్య తర్వాత బోయపాటి ఇంకో హీరోను కలవలేదు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అంటే బోయపాటికి సూర్య ఓకే చెప్పారు అని ఇన్‌డైరెక్ట్‌గా తేలింది.

ఇప్పుడు కార్తి సినిమా ‘సర్దార్‌ 2’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం బోయపాటి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్‌ స్టైల్‌లో తెలిసినవారికి ఎవరికైనా ‘కార్తి కోసం బోయపాటి’ ఎందుకొచ్చినట్లు అడే డౌట్‌ వస్తుంది. ఈ విషయంలో కార్తి దాదాపు క్లారిటీ ఇచ్చేశాడు కూడా. మేం ఈ మధ్య కాలంలో చాలాసార్లు కలిశాం. అలా అని అవి సిట్టింగ్స్‌ కాదు.. మీటింగ్స్‌ మాత్రమే అని చెప్పారు కార్తి. అంటే బోయపాటి చెన్నై వెళ్లడం పక్కా.. సూర్యతో స్టోరీ డిస్కషన్స్‌ పక్కా అని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో సినిమా అనౌన్స్‌మెంట్‌ ఒక్కటే పెండింగ్‌ అనిపిస్తోంది. అది సూర్య 50వ సినిమానా? లేక ఆ తర్వాతనా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే సూర్య 50వ సినిమా కోసం శంకర్‌ – మురుగదాస్‌ కాంబో వర్క్‌ చేస్తోంది అని మొన్నీమధ్యనే కోడంబాక్కం వర్గాలు చెప్పాయి. చూద్దాం బోయపాటి ‘రెడీ బాబూ..’ అని ఎప్పుడంటారో?

కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus