‘దొంగ’ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత..!

ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ కి ‘ఖైదీ’ రూపంలో ఏకంగా బ్లాక్ బస్టర్ దక్కింది. ఈ సినిమా విడుదల వరకూ ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు లేవు. పైగా కార్తీ గత చిత్రం ‘దేవ్’ కూడా డిజాస్టర్ కావడంతో.. మొదట్లో ‘ఖైదీ’ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే.. ఎమోషన్స్ తో కూడుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత కార్తీ నుండీ వస్తోన్న మరో చిత్రం ‘దొంగ’.

’18 స్టూడియోస్‌’, ‘ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌’ సంస్థలు కలిసి ‘దొంగ’ చిత్రాన్ని నిర్మించాయి. మలయాళం ‘దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఇక ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ‘హర్షిత మూవీస్’ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. దాదాపు 4 కోట్లకు ఈ చిత్రం హక్కులని ఆయన సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నిజజీవితంలో కార్తీకి వదిన అయిన జ్యోతిక.. ‘దొంగ’ చిత్రంలో మాత్రం అక్కగా నటిస్తుండడం విశేషం.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus