కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ఖైదీ. తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ చిత్రం కార్తీని వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. హీరోయిన్, సాంగ్స్, కామెడీ లాంటి ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కి ఇంత పెద్ద విజయం సాధించడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం యాక్షన్ అండ్ ఎమోషన్స్, పట్టుసడలని స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని విజయం వైపు నడిపించింది.
టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన ఖైదీ చిత్రం అతనికి సూపర్ ఫేమ్ తెచ్చిపెట్టింది. కాగా ఈ చిత్రం త్వరలో హిందీలో రిమేక్ కానుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రంలో ఓ బడా హీరో నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి పని చేసే ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలియాల్సివుంది. ఇంకొన్ని నెలలో లోకేష్ కానగరాజ్ మాస్టర్ మూవీ చిత్రీకరణ పూర్తి చేయనున్న నేపథ్యంలో ఆయనే హిందీ వర్షన్ కి కూడా దర్శకత్వం వహించే అవకాశం కలదు. ఇక షారుఖ్ ఈ చిత్రంలో నటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకనగా బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్క షారుఖ్ మాత్రమే ఏడాదిన్నరగా ఖాళీగా ఉంటున్నారు.