పూరీపై సీనియర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
- August 21, 2017 / 06:19 AM ISTByFilmy Focus
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ తోపాటు న్యూస్ చానల్స్, జనాలు కూడా డ్రగ్స్ కేస్ సెన్సేషన్ ను మర్చిపోయి వేరే విషయాలవైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకొంటున్నది మన బాలయ్య బాబు చెయ్యి దురుసు గురించి. ఆయన తన వద్దకు ఎంతో ప్రేమతో వచ్చిన అభిమానుల చెంప చెళ్లుమనిపించడం హాట్ టాపిక్ అయిన తరుణంలో.. మొన్న జరిగిన “పైసా వసూల్” ఆడియో విడుదల వేడుకలో “బాలయ్య కొడితే అభిమానులు ఎంజాయ్ చేస్తారు” అంటూ పూరీ జగన్నాధ్ ఆయన చేతి దురుసును సపోర్ట్ చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆ విషయం గురించి రచ్చ రచ్చ జరిగింది.
కట్ చేస్తే.. సీనియర్ హీరోయిన్ కస్తూరి ఇప్పుడు పూరీ కామెంట్స్ పై తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ సెన్సేషనల్ కామెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్ పై చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది. అదేంటంటే.. “ఆయనపై డ్రగ్స్ కేసు ఉరిపే పెట్టలేదు” అని పూరీ కామెంట్ ను ఉద్దేశించి కస్తూరి చేసిన కామెంట్ పూరీ ఫాలోవర్స్ అందర్నీ బాగా హర్ట్ చేసింది. మరి ఈ మేటర్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











