ప్రముఖ గాయని సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. నిజానికి సునీత పెళ్లి కూతురు చేసే ఫంక్షన్ ఫొటోలు ఇంకా ఎక్కువ సందడి చేస్తున్నాయి. దానికి కారణం కూడా ఉంది. ఆ ఫొటోల్లో సునీత పెళ్లి కూతుర్ని చేస్తోంది ఆమె పిల్లలే. అందులో సునీత నవ్వు చూస్తే కడుపు నిండిపోతోంది అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫొటోలకు వచ్చేసరికి సునీత ముఖంలో ఆనందం రెట్టింపు అయ్యింది… నెటిజన్ల కామెంట్లు కూడా డబుల్ అయ్యాయి. అంతే కాదు ఏదో మూల నుంచి నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి.
సమాజంలో ప్రతి విషయంపై గళమెత్తే సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ కూడా సునీత రెండో పెళ్లి విషయమై స్పందిచాడు. పెళ్లి గురించి, ఆమె గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫొటోలు, వీడియోల్లో సునీత కళ్లల్లో ఆనందం చూస్తే ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎవరైనా రెండో పెళ్లిని చాటుగా చేసుకుంటారు. పెళ్లి విషయంలో కొంచెం గిల్టీగా ఫీలవుతారు. కానీ సునీత కళ్లలో ఆ ఆనందం ఏంటి? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? సొసైటీ నాశనమైపోదా” అంటూ కత్తి మహేష్ తన ఫేస్ బుక్ పేజీలో ఘాటు వ్యాఖ్యలను చేశాడు.

మామూలుగా తన విషయంలో, తన పెళ్లి విషయంలో కామెంట్లు చేసేవారికి సునీత గట్టిగానే సమాధానం చెబుతూ ఉంటుంది. మరి కత్తి మహేష్ విషయంలో ఏం సమాధానం చెబుతుందో… లేక పోనీలే అని వదిలేస్తుందో చూడాలి. డిజిటల్ కంపెనీ సీఈవో రామ్ వీరపనేనితో సునీతకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. రామ్‌కు కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మరి కత్తి మహేష్ ఆయన మీద కామెంట్స్ ఎందుకు చేయలేదో?
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!
