సెలబ్రిటీలు కేవలం వారి సినిమాల ఫంక్షన్లకి మాత్రమే కాదు అవార్డు ఫంక్షన్లకి, ఈవెంట్ లలో కూడా డ్యాన్స్ లు చేస్తుంటారు. అంతేకాదు ఐపీయల్ ఈవెంట్ లలో కూడా ఆడి పాడిన సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కొంతమంది సింగర్స్ లాంటి వాళ్ళు బయట ఫంక్షన్లలో ఆడుతుంటారు. హీరోయిన్లు మాత్రం ఎక్కువగా ఇలా బయట ఫంక్షన్లలో ఆడటం ఇప్పటివరకూ అసాద్యమనే చెప్పాలి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పెళ్ళి ఫంక్షన్ లో తన డ్యాన్స్ లతో దుమ్ము రేపింది.ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.
ఇటీవల ఓ భారీ వివాహ వేడుకలో కత్రినా డ్యాన్స్ లతో దుమ్మురేపింది. డెహ్రాడూన్ లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏకంగా రూ.200 కోట్ల ఖర్చుతో వివాహ వేడుకను ఘనంగా ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో డ్యాన్స్ చేయాలని కత్రినా కైఫ్ ను కోరారట. కత్రినాతో పాటు పలువురు సెలబ్రిటీలకు పిలుపు అందిందట. రెమ్యునరేషన్ ఎక్కువగా ఆఫర్ చేయడంతో వారు కూడా ఒప్పుకున్నారట. ఈ వేడుకలో కత్రినా తాను నటించిన ‘తీస్ మార్ ఖాన్’ చిత్రంలోని ‘షీలా కీ జవానీ’ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఖుషీ చేసింది. ప్రస్తుతం కత్రినా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.