బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్ళడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం తన మాజీ ప్రేమికుడు రన్ బీర్ కపూర్ తో కలిసి ‘జగ్గ జసూస్’ చిత్రంలో కత్రినా నటిస్తుండగా.. ఇటీవలే ఈ చిత్రం మొరాకో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొరాకో షెడ్యూల్ ముగిసిన వెంటనే కత్రినా లండన్ లోని తన తల్లిద్రండ్రుల వద్దకు వెళ్లింది. ఇటీవలే ముంబై చేరుకోగా ఆమె కాస్త అస్వస్థతకు గురైనట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
బిజీ షెడ్యూల్ వల్ల, వాతావరణంలో మార్పుల వల్ల ఆమె అస్వస్థతకు గురైందని అంటున్నారు. మరోవైపు ఆమె వెంట ఆమె మేనేజర్, కొంత మంది మహిళా సిబ్బంది ఉండగా.. ఆసుపత్రికి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.