పెళ్లి విషయంలో అమ్మాయిలు చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఆ వేడుకలో జరిగే ప్రతీ తంతు స్పెషల్ గా ఉండాలని భావిస్తారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా తన పెళ్లి సంబంధించిన అన్ని విషయాలు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటోంది. ఎలాంటి అధికార ప్రకటన లేకుండా కత్రినా-విక్కీ కౌశల్ ల వివాహం జరగబోతుంది. ఈ వేడుకల్లో కత్రినా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో.. దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబర్ 7 నుంచి 12 వరకు కత్రినా పెళ్లి సంబరాలు జరగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం కత్రినా తన కాళ్లు, చేతులకు వేసుకునే మెహందీ రాజస్థాన్ లో ప్రసిద్ధి చెందిన ‘సోజత్ మెహందీ’తో తయారు చేస్తున్నారట. సోజత్ లోని కళాకారులు ఎలాంటి రసాయనాలు లేకుండా చేతితో మెహందీ తయారు చేస్తారట. దీని విలువ సుమారు రూ.50,000 నుంచి లక్ష వరకు ఉంటుందని సమాచారం. ఒక్క మెహందీ కోసం లక్షల్లో ఖర్చు పెడుతోందంటే..
ఇక పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి మరి. ఈ వేడుకకు సుమారు 125 మంది వీఐ పీ అతిథులు హాజరు కానున్నారు. ముంబై నుంచి గెస్ట్‌లు మొదట జైపూర్‌లో దిగుతారు. వారికోసం భారీ లగ్జరీ బస్సులు, కార్లు కూడా బుక్ అయ్యాయని సమాచారం. ఈ పెళ్లిలో ప్రముఖ రాజస్థానీ వంటకాలు వడ్డించనున్నారట. కత్రినా-విక్కీ కౌశల్ తమ పెళ్లిలో సభ్యసాచి వస్త్రాలను ధరించనున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?