‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలైంది. రామ్ (Ram) – పూరీ జగన్నాథ్ (Puri Jagannadh).. కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం 2019 లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) కి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. దీంతో మొదటి నుండి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను సినిమా పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. మొదటి షోతోనే ‘డబుల్ ఇస్మార్ట్’ కి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో పోల్చి దీన్ని చిన్న చూపు చూశారు ప్రేక్షకులు.
అందువల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. ఇక ఈ చిత్రంపై రామ్, పూరీతో పాటు హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. సహజంగానే కావ్య.. అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంటుంది.ఏ సినిమాకి అయినా సరే ఆమె గ్లామర్ హైలెట్ అవుతుంది. అలాంటిది పూరీ జగన్నాథ్ సినిమా అంటే గ్లామర్.. లేకుండా ఉంటుందా. కావ్య థాపర్ గ్లామర్ యాంగిల్ సినిమాలో ఓ రేంజ్లో ఉంటుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నభా నటేష్ (Nabha Natesh) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) . రేంజ్ పెరిగింది. ఆ సినిమాలో వాళ్ళ గ్లామర్ డోస్ ఆ రేంజ్లో ఉంటుంది. సో అదే విధంగా ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత కావ్య రేంజ్ కూడా పెరుగుతుంది అని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సినిమా నిరాశపరచడంతో కావ్య థాపర్ గ్లామర్ కష్టం వేస్ట్ అయిపోయింది అని చెప్పాలి.