Keerthi Bhatt: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఫుడ్ టేస్ట్ చేసిన కీర్తిభట్.. ఏమైందంటే?

  • February 18, 2024 / 12:03 PM IST

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కుమారి ఆంటీ పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. కుమారి ఆంటీ ఫుడ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రీల్స్ వైరల్ అయ్యాయి. ప్రముఖ టీవీ షోలలో సైతం కుమారి ఆంటీ సందడి చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన కీర్తిభట్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేసి తన రివ్యూ ఇచ్చారు.

కీర్తి భట్ తో పాటు ఆమె వుడ్ బి విజయ్ కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఫుడ్ టేస్ట్ గా లేదని ఆమె, విజయ్ వెల్లడించారు. వైట్ రైస్, చికెన్ ఫ్రై తీసుకున్నామని అందుకోసం 170 రూపాయలు ఖర్చు చేశామని కీర్తి భట్, విజయ్ పేర్కొన్నారు. ఫుడ్ చాలా స్పైసీగా ఉందని ఫుడ్ తినడం నా వల్ల కాలేదని కీర్తిభట్ అన్నారు. తాను కుక్ చేస్తే ఇక్కడి ఫుడ్ కంటే బెటర్ గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

క్వాంటిటీ పెరగడం వల్ల ఫుడ్ కు సంబంధించి క్వాలిటీ తగ్గిందేమో అని కీర్తి భట్ కామెంట్లు చేశారు. రష్ మాత్రం చాలా ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. రీల్స్ చేసి కుమారి ఆంటీ ఫుడ్ ను ఎందుకు ఇంతలా ఫేమస్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని కీర్తి భట్ వెల్లడించడం గమనార్హం. కీర్తి భట్ కామెంట్ల గురించి కుమారి ఆంటీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

కుమారి ఆంటీకి ప్రముఖ టీవీ షోల నుంచి ఆఫర్లు వస్తుండటంతో ఆమె ఈ విధంగా కూడా బిజీ అవుతున్నారని తెలుస్తోంది. కుమారి ఆంటీకి టీవీ షోలలో పాల్గొంటే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను ఇస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో కుమారి ఆంటీ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కుమారి ఆంటీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus