Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

ఒకరు స్టార్‌ క్లాస్‌ హీరోయిన్‌ అనే పదానికే అర్థం చెప్పిన నాయిక.. మరొకరు ‘హీరో’యిన్‌ అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన కథానాయిక.. మరొకరు ఇప్పుడిప్పుడు స్టార్‌ హీరోయిన్‌ స్థాయి పాన్‌ ఇండియా హీరోయిన్‌ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్న నాయిక. ఈ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి అమితానందం పొందుతున్నారు. సౌత్‌ సినిమా మీట్స్‌ బాలీవుడ్‌ వయా బెంగాళీ సినిమా అనేలా ఉన్న ఆ పిక్‌లో ఉన్నది లెజెండరీ రేఖ, హీరోయిన్‌ రాణీ ముఖర్జీ, కీర్తి సురేశ్‌.

Keerthy – Rekha – Rani

‘యాన్‌ ఈవెనింగ్‌ టు రిమెంటర్‌’ అంటూ కథానాయిక కీర్తి సురేశ్‌ ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన కీర్తి సురేశ్‌.. ఇప్పుడు ముంబయిలో జరిగే ఈవెంట్స్‌లో పాల్గొంటూ అక్కడ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ఎప్పటిలా రేఖ తన ట్రేడ్‌మార్క్ క్రీమ్ కలర్ చీర, కూలింగ్ గ్లాసెస్‌తో కనిపించగా.. రాణీ ముఖర్జీ మెరూన్ టాప్‌లో వావ్‌ అనిపించింది. వీరిమధ్యలో నిల్చున్న కీర్తి సురేష్ బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో మెరిసిపోయింది.

ఈ ఏడాది ‘ఉప్పు కప్పురంబు’, ‘రివాల్వర్‌ రీటా’ అని రెండు సినిమాలు చేసిన కీర్తి.. సరైన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తమిళంలో ‘కన్నెవెడి’ అనే సినిమాలో నటిస్తోంది. మలయాళంలో ‘తొట్టమ్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో మూడేళ్ల తర్వాత ఓ సినిమా అంగీకరించింది. విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన’ అనే సినిమాలో నటిస్తోంది. ఆమె ఆఖరిగా 2023లో ‘భోళా శంకర్‌’ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన విషయం తెలిసిందే.

ఒక విధంగా కీర్తి సురేశ్‌ ఇప్పుడు ఆశించిన రేంజిలో లేదు. ఎందుకంటే ఆమెకు సరైన విజయం వచ్చి మూడేళ్లు అయిపోయింది. నాని ‘దసరా’ 2023లో వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా విజయాలు అయితే రావడం లేదు.

 ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus