అభిమానులపై కోప్పడిన హీరోయిన్!

ఈ సంవత్సరం మొదట్లో ‘నేను.. శైలజ’ అంటూ ఓ సినిమా వచ్చి హిట్ కొట్టింది. ఆ సినిమా ద్వారా కీర్తి సురేష్ అనే కోలీవుడ్ భామ తెలుగు తెరకు పరిచయమయింది. ఈ సినిమాతో కుర్రకారుకు బాగా దగ్గరైపోయింది కీర్తి. తరువాత కీర్తికి తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ తమిళ చిత్రాలతో బిజీ అయిపోవడం వలన మరో తెలుగు సినిమాలో కనిపించలేదు.

కోలీవుడ్ లో మాత్రం అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అక్కడ ధనుష్, అజిత్, విజయ్,సూర్య వంటి అగ్ర హీరోలతో నటిస్తూ… స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. మొన్నామధ్య కీర్తి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో లైవ్ చాట్ చేసింది. అయితే ధనుష్ తో ఆమె నటిస్తోన్న ‘తొడారి’ సినిమా ట్రైలర్ గురించి అభిమానులు ప్రస్తావిస్తూ.. ట్రైలర్ చూస్తుంటే బీ గ్రేడ్ సినిమాలా అనిపించిందంటూ.. అసంతృప్తి వ్యక్తం చేశారట.

దాంతో కీర్తికి కోపం వచ్చి నేను బీ గ్రేడ్ సినిమాల్లో నటించే హీరోయిన్ ని కాదంటూ… సినిమా రిలీజ్ అయిన తరువాత మాట్లాడండంటూ.. అమ్మడు ఘాటుగానే స్పందించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus