Keerthy Suresh: బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేష్!

  • July 29, 2023 / 08:57 PM IST

కీర్తి సురేష్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక కథ నచ్చితే హీరోలకు చెల్లెలు పాత్రలలో నటించడానికి కూడా కీర్తి సురేష్ వెనకాడటం లేదు ఇలా చెల్లెలి పాత్రలలోనూ అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నార. ఇక తెలుగులో ఈమె చివరిగా నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) వెన్నెల పాత్రలో డి గ్లామర్ రోల్ చేస్తూ తన నటనతో అందరిని మెప్పించారని చెప్పాలి వరుస ప్లాపులతో సతమతమవుతున్నటువంటి కీర్తి సురేష్ కు దసరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తిరిగి ఈమె ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ బిజీ అయ్యారు. ఇక నటిగా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు చేశారు.

ఇక తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక సినిమాలో ఆయన నటించాలని ఉంది అంటూ తెలియజేశారు. తాను ఇండస్ట్రీ నుంచి తప్పుకునే లోపు షారుక్ ఖాన్ సరసన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమాలో అయినా నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా తన మనసులో కోరిక బయటపెట్టారు.

మరి ఈ బాలీవుడ్ స్టార్స్ వారి సినిమాలలో తనకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమన్నా జంటగా నటించిన భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో ఈమె చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus