సంచలన కామెంట్స్ చేసిన కీర్తి సురేష్

నేను శైలజ… నేను లోకల్.. సినిమాలతో కీర్తి సురేష్ తెలుగు వారికి దగ్గరయింది. తమిళంలోనూ ఆమె నటించిన రెమో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ లలో బిజీ హీరోయిన్ అయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి తో పాటు తమిళంలో సూర్యతో తానా సెరేంద్ర కూట్టం, విక్రమ్ తో సామి 2, విశాల్ తో సండైకోళి-2(పందెంకోడి2) చిత్రాలలో కీర్తి హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్‌ 62వ చిత్రంలోని ఛాన్స్ పట్టేసింది. విజయాలు వెంటే వివాదాలు ఉంటాయని అన్నట్టు.. కీర్తి సురేష్ పై అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇతర హీరోయిన్ల అవకాశాలను కీర్తి కొట్టేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమె తనపై వచ్చిన విమర్శలను ఈరోజు తిప్పి కొట్టింది.

కీర్తి మీడియాతో మాట్లాడుతూ “మొదట రెండు విషయాల గురించి స్పష్టం చేస్తున్నాను. అందులో ఒకటి నేను ఎక్కువగా పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. నాకు తగ్గ పారితోషికాన్నే నిర్మాతలు చెల్లిస్తున్నారు. రెండో అంశం సండైకోళి- 2 చిత్రం కథను దర్శకుడు చెప్పినప్పుడు నా పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించాను. ఈ చిత్రంలో త్రిష కూడా నటిస్తున్నారని అప్పుడు దర్శకుడు చెప్పారని, ఆ తరువాత ఆమె ఎందుకు తప్పుకున్నారో నాకు తెలియదు” అన్నారు. “అజ్ఞాతవాసి” చిత్ర ఆడియో రిలీజ్ వేడుకకు చీర కట్టుకుని వెళ్లినా తనని విమర్శించారని.. సంప్రదాయబద్ధంగా వెళ్లినా కామెంట్స్ రావడం బాధకలిగించిందని వెల్లడించారు. ఇటువంటి నెగటివ్ ప్రచారం ఆపమని హితవు పలికారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో కీర్తి నటించిన అజ్ఞాతవాసి రేపు థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus