సావిత్రి అభిరుచులు తెలుసుకొని కీర్తి సురేష్ ఎందుకు ఆశ్చర్య పోయింది ?

‘నేను శైలజ’.. ‘నేను లోకల్’.. ఈ రెండు సినిమాలతో తెలుగు వారి హృదయాల్లో తమిళ నటి కీర్తి సురేష్ మంచి స్థానాన్ని సంపాదించుకుంది. హద్దులు మీరని అందంతో.. చక్కని అభినయంతో ఆకట్టుకుంది. అందుకే ఈ భామ అలనాటి మహానటి సావిత్రిగా నటించే అవకాశాన్ని అందుకుంది. సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ వెండితెరపై బంధిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కి మహానటి గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలని అనిపించిందంట. అందుకే సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరిని అడిగింది. ఆమె తల్లి గురించి వివరంగా ఓ లేఖలో రాసి పంపించింది. అది చదివిన కీర్తి ఆశ్చర్యపోయిందంట.

ఎందుకో కీర్తి మాటల్లోనే… “సావిత్రి గారి గురించి తెలుసుకునేందుకు ఆమె కూతురు విజయగారితో మాట్లాడాను. సావిత్రిగారి అలవాట్ల గురించి, అభిరుచుల గురించి చాలా చెప్పారు. నాలుగు రోజుల తర్వాత సావిత్రి గారి గురించి ఆమె ఓ ఉత్తరం రాశారు. అందులో కొన్ని విషయాలు చదివి నేను ఆశ్చర్యపోయాను. సావిత్రిగారికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. `టీ` ఇంకా ఇష్టం. అలాగే సావిత్రిగారు ఎంతో ఇష్టంగా క్రికెట్ ఆడేవారట. ఇక, కార్ డ్రైవింగ్ అన్నా ఆమెకు చాలా ఇష్టమట. ఈ విషయాలు నాకు షాక్‌ను కలిగించాయి. ఎందుకంటే ఇవన్నీ నాకూ చాలా ఇష్టమైన అంశాలు. సావిత్రగారికి, నాకూ కామన్ ఇంట్రెస్టులు చాలా ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను” అని వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus