Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ సినిమా… మరో 12 రోజుల్లో అంటే జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ విపరీతంగా హైప్ పెంచేశాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాని హీరో, హీరోయిన్ల కంటే ఎక్కువగా నాగవంశీనే ప్రమోట్ చేస్తున్నాడని చెప్పాలి. టీజర్, ట్రైలర్, పాటలు వంటివి కూడా ప్రామిసింగ్ గా అనిపించాయి. సినిమా పై అంచనాలు పెంచాయి. సత్యదేవ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.మరోపక్క ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చిత్ర బృందం ముందుగానే హింట్ ఇచ్చింది.

Keerthy Suresh

అయితే అది వెంటనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. ‘కింగ్డమ్’ తర్వాత విజయ్ ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. రవి కిరణ్ కోలా దర్శకుడు. ఇదిలా ఉండగా.. ‘రౌడీ జనార్దన్’ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైనట్టు కథనాలు వినిపించాయి. ఆమె కన్ఫర్మ్ చేయలేదు. కానీ పరోక్షంగా ‘ఆ విషయాన్ని దిల్ రాజు రివీల్ చేస్తారు’ అంటూ మాట దాటేసింది.

మరోపక్క ‘రౌడీ జనార్దన్’ లో కీర్తి పాత్ర షాక్ కి గురి చేస్తుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘రౌడీ జనార్దన్’ లో కీర్తి సురేష్ వేశ్య పాత్రలో కనిపిస్తుంది అంటున్నారు. కీర్తి సురేష్ మునుపెన్నడూ చేయని పాత్ర అది. భవిష్యత్తులో కూడా ఆమె ఇలాంటి పాత్ర చేస్తుంది అని ఊహించిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అధికారిక ప్రకటన వస్తేనే.. దీని గురించి ఓ క్లారిటీ వస్తుంది. అప్పటివరకు వేచి చూడాలి.

శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus