టాలీవుడ్లో హీరోలు నిలకడగా రాణించలేకపోతున్నారు. స్టార్ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.దీంతో సీనియర్ స్టార్ హీరోలను మిగిలిన స్టార్ డైరెక్టర్లు లైన్లో పెట్టేస్తున్నారు. ఇక మిడ్ రేంజ్, యంగ్ హీరోలు మాత్రం కన్సిస్టెంట్ గా హిట్లు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ సినిమాలు హిట్ అయితేనే థియేటర్లకు ఫీడింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసేది వాళ్ళే. ఇలాంటి టైంలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లిసందD’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
రోషన్ లుక్స్,పెర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. అప్ కమింగ్ జెనరేషన్లో ఇలాంటి 6 అడుగుల అందగాళ్ళు ఎక్కువమంది లేరు. కాబట్టి రోషన్ కు ఇదే మంచి ఛాన్స్. కానీ ‘పెళ్లిసందD’ తర్వాత రోషన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అంటే 3 ఏళ్ళు అతని ప్రైమ్ టైం వేస్ట్ చేసుకున్నట్టే అని చెప్పాలి. ప్రస్తుతం రోషన్ ‘స్వప్న సినిమా’ ‘ఆనంది ఆర్ట్స్’ సంస్థలో ‘ఛాంపియన్’ అనే సినిమా చేస్తున్నాడు.
‘సేవ్ ది టైగర్స్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ తీసిన ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇది తప్ప రోషన్ సినిమా ఇంకోటి సెట్స్ పైకి వెళ్ళింది లేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. గత ఏడాది నుండి చూసుకుంటే శ్రీకాంత్… రోషన్ కి సంబంధించి 50 స్క్రిప్టులు రిజెక్ట్ చేశాడట. రోషన్ కెరీర్ విషయంలో శ్రీకాంత్ ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు.
ఆఫర్స్ వస్తున్నాయి కదా అని వరుస సినిమాలు ఓకే చేసి రోషన్ కెరీర్ ను ఇబ్బందుల్లో పెట్టడం ఇష్టం లేక శ్రీకాంత్ ఇలా కఠినంగా వ్యవహరిస్తునట్టు తెలుస్తుంది. రోషన్ కి ఆల్రెడీ ఏషియన్ సునీల్, అన్నపూర్ణ స్టూడియోస్, సితార వంటి అగ్ర నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్సులు అందాయి. రోషన్ కోసం కొత్త దర్శకులు, టాలెంటెడ్ దర్శకులతో వాళ్ళు కథలు రాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ కొడుకు భవిష్యత్తు గురించి అతి జాగ్రత్త చూపిస్తే.. అతని ప్రైమ్ టైం మరింత వేస్ట్ అయిపోతుంది అనే చెప్పాలి.