iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మార్కెట్ ను రెండింతలు పెంచిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి, ఛార్మి కలిసి నటించిన ఈ సినిమా 2019 జూలై 18న విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ మొదటి షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.70 కోట్లు పైనే వసూళ్లు సాధించింది ఈ సినిమా.

iSmart Shankar

నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పూరి అప్పులన్నీ తీరిపోయాయి. మళ్ళీ అతనికి పూర్వ వైభవం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అనవసరం. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా.. రామ్ కెరీర్లోనూ, పూరి కెరీర్లోనూ బాగా స్పెషల్ అనే చెప్పాలి.

అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి హైలెట్స్ అంటే మణిశర్మ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే అంతా చెబుతారు. అలాగే రామ్ ను పూరి ప్రజెంట్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ల గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలింది. నిధి అగర్వాల్, నభా నటేష్.. ల గ్లామర్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అయితే నభా ప్లేస్ లో ముందుగా వేరే హీరోయిన్ ను తీసుకోవాలి అని అనుకున్నాడట పూరి.

ఆమె మరెవరో కాదు మన్నారా చోప్రా. అవును నభా నటేష్ పాత్రకి ముందుగా మన్నారాని అనుకున్నారట. కానీ మన్నారా లుక్స్, ఆటిట్యూడ్ తో పూరి సంతృప్తి చెందలేదు. అందుకే ఆమెను తప్పించి నభా నటేష్ ను తీసుకున్నట్లు టాక్ నడిచింది. ఈ సినిమా తర్వాత నభా రేంజ్ పెరిగింది. సాయి ధరమ్ తేజ్ వంటి హీరోల సరసన సోలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఆ రకంగా చూసుకుంటే మన్నారా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే అని చెప్పాలి.

 ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus