సోషల్ మీడియాలో సినిమా వాళ్లకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. అందులోనూ లేడీస్ అంటే నటీమణులు ఖాతాలకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళ పై స్పెషల్ ఫోకస్ కూడా పెడతారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ కి ఉన్న వాల్యూ అలాంటిది. సాధారణంగా నటీమణులు ఏ పోస్టులు పెట్టినా కొంతమంది ఆకతాయి మూక వంకరగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్లకి లీడ్ ఇచ్చే విధంగా నెగిటివ్ కామెంట్ తో పోస్ట్ పెడితే వాళ్ళు కంట్రోల్లో ఉంటారా. ఇప్పుడు అదే జరిగింది.
అసలు విషయంలోకి వెళితే.. నటి రిచా చడ్డా తన కూతురు జునెయిరా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. నార్మల్ డెలివరీ అయితే నేచురల్ బర్త్ అని కొందరు అంటుంటారు. కానీ రిచా దానికి కొంచెం బోల్డ్ యాడ్ చేసి వెజి*నల్ బర్త్ అనే అర్ధం వచ్చేలా కామెంట్స్ చేసింది.దీంతో అంతా ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ఇందుకు ఆమె స్పందించింది. ‘నా పేజ్ .. నా యోని.. నా బిడ్డ.. నా ఇష్టం’ అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది.
అయినప్పటికీ విమర్శలు ఆగకపోవడంతో… ‘గర్భిణీగా ఉన్నప్పుడు నా అనుభవాన్ని తెలియపరచడం తప్పు కాదు అనేది నా అభిప్రాయం. విమర్శించే ముందు ఒకసారి ఆలోచించాలి. నా జునెయిరా సిజేరియన్ వంటి అత్యవసర చికిత్స అవసరం లేకుండా జన్మించింది అని తెలపడం.. నా ప్రధాన ఉద్దేశం’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె పోస్ట్ ను ఎడిట్ చేసింది.