దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటెర్టైనర్స్ లో ‘కేరింత’ మూవీ కూడా ఒకటి. సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో భావన అనే పాత్రలో నటించి మెప్పించింది సుకృతి. పార్వతీశం తో కలిసి ఈమె చేసిన కామెడీకి థియేటర్లో నవ్వుల వర్షం కురిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది.
ఇదిలా ఉండగా.. సుకృతి నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. అక్షయ్ సింగ్‌తో ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ సందర్భంగా సుకృతి స్పందిస్తూ… ‘మా నాన్నే నా ప్రపంచం. భయపడినప్పుడు నా భుజం తట్టి, నన్ను సంతోష పరుస్తూ, నా చేయి పట్టుకొని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నారు. ఎప్పుడూ నాకు గొప్ప నాన్నలాగే ఉన్నారాయన. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది.
అప్పటి నుంచి అమ్మ ప్రేమను సైతం ఆయనే అందించారు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తి మా నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్’ అంటూ పేర్కొంది సుకృతి. ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!