ఆమిర్ ఖాన్ ను బీట్ చేసిన కన్నడ స్టార్!

రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందించిన పాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్2’ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటివరకు కలెక్ట్ చేసిన హయ్యెస్ట్ గ్రామర్ లో టాప్ 2లో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా ఉంది.

ఇప్పుడు దాన్ని ‘కేజీఎఫ్2’ క్రాస్ చేసింది. అప్పట్లో ‘దంగల్’ సినిమా రూ.387.40 కోట్లను వసూలు చేసింది. ఆ సినిమాను ‘బాహుబలి 2’ బీట్ చేసింది. ఇది ఏకంగా రూ.510 కోట్లను రాబట్టింది. ‘బాహుబలి2’ తరువాతి స్థానంలో ‘దంగల్’ సినిమా ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టింది ‘కేజీఎఫ్2’. బుధవారం నాటికి ‘కేజీఎఫ్2’ సినిమా రూ.390 కోట్లను రాబట్టింది.

ఆరేళ్లలో ‘దంగల్’ రికార్డులను ఈ సినిమా కొల్లగొట్టింది. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ లో ఉన్న రెండు సినిమాలు సౌత్ సినిమాలే అన్నమాట. ‘దంగల్’ సినిమాను ‘కేజీఎఫ్2’ బీట్ చేయడంతో సినీ అభిమానులు ఈ విషయాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ‘కేజీఎఫ్2’ని బీట్ చేసే సినిమాలు బాలీవుడ్ లో వస్తాయా..? అని ప్రశ్నిస్తున్నారు.

హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మించిన ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ వంటి బాలీవుడ్ స్టార్స్ న‌టించారు. ఇప్పుడు ఈ సినిమా 21 రోజుల్లోనే దంగ‌ల్ రికార్డుల‌ను దాటేయ‌డంపై అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు కొన‌సాగింపుగా ‘కేజీఎఫ్3’ కూడా ఉంటుంద‌ని దర్శకుడు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus