రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డానంటు పోస్ట్?

సాధారణంగా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు ముంచుకొస్తూ ఉంటాయి. అయితే మన అదృష్టం బాగుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా బ్రతికి బయటపడతాము. తాజాగా ఇలాంటి అదృష్టంతోనే తాను ప్రాణాల నుంచి బయట పడ్డానని తెలియజేశారు కేజిఎఫ్ నటుడు అవినాష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన కన్నడ నటుడు అవినాష్ కి కూడా భారీ స్థాయిలో ఆదరణ లభించింది.

రోడ్డు ప్రమాదానికి గురయ్యానని అయితే ఎలాంటి ప్రాణపాయం లేకుండా బయటపడ్డానని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదిక నటుడు అవినాష్ స్పందిస్తూ నిన్న ఉదయం కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యాను అయితే భగవంతుడి దయ వల్ల ఏ విధమైనటువంటి గాయాలు లేకుండా బయటపడ్డానని ఈయన వెల్లడించారు. ఒక ఈవెంట్ కి వెళ్లాల్సి ఉండగా ఆలస్యం కావడంతో జిమ్ నుంచి ఖాళీగా ఉన్న రోడ్డుపై చాలా వేగంగా ప్రయాణిస్తున్నాను.

అదే సమయంలో అనిల్ కుంబ్లే దగ్గర సిగ్నల్ పడగా ఎదురుగా ఒక కంటైనర్ వచ్చి నా కారును ఢీకొన్నింది. అభిమానుల ప్రేమ ఆ భగవంతుడి దయతో నాకు ఎలాంటి గాయాలు కానీ తగలలేదని ప్రాణాలతో బయటపడ్డాను తనుకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈరోజు తన అదృష్టం ఎంతో బాగుందని లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయంకరంగా ఉందంటూ ఈయన పోస్ట్ చేశారు.

ఇకపోతే అవినాష్ తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అభిమానులు ఈయన పోస్ట్ కు రిప్లై ఇస్తూ కామెంట్ చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus