2018 వ సంవత్సరం చివర్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజం, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.10 వ రోజున కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.
ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
35.97 cr
సీడెడ్
9.82 cr
ఉత్తరాంధ్ర
6.47 cr
ఈస్ట్
4.80 cr
వెస్ట్
2.94 cr
గుంటూరు
3.86 cr
కృష్ణా
3.55 cr
నెల్లూరు
2.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
70,7 cr
‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.70.7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది. అయితే ‘కె.జి.ఎఫ్ 2’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ కు పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కాబట్టి కే.జి.ఎఫ్ భారీగా క్యాష్ చేసుకుంటుంది అనుకుంటే జస్ట్ డీసెంట్ అనిపిస్తుంది.