2018 వ సంవత్సరం చివర్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న గురువారం నాడు విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజాన్ని .. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.
టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. దీంతో మొదటి రోజు కి ఏమాత్రం తీసిపోకుండా రెండో రోజు కూడా కలెక్షన్లు అదిరిపోయాయి.మూడో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.
ఒకసారి 3డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
23.3 cr
సీడెడ్
6.1 cr
ఉత్తరాంధ్ర
3.92 cr
ఈస్ట్
2.52 cr
వెస్ట్
1.68 cr
గుంటూరు
2.32 cr
కృష్ణా
2.08 cr
నెల్లూరు
1.37 cr (కరెక్టెడ్)
ఏపీ + తెలంగాణ (టోటల్)
41.92 cr
‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.41.92 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది. తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు మరో రూ.34.08 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు కానీ మూవీకి హిట్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఆదివారం రోజున కూడా బుకింగ్స్ బాగున్నాయి. మరి సోమవారం నుండీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.