‘ఖడ్గం’ భామ తన తల్లిని ఇంటి నుండీ గెంటేస్తుందట..!

‘పెళ్ళాం ఊరెళితే’ ‘సంక్రాంతి’ ‘ఖడ్గం’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత అందరికీ సుపరిచితమే. అయితే పెద్ద సక్సెస్ లు ఏమీ లేకపోవడంతో పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు. అడపా దడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. పెళ్లయ్యాక కాస్త సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వభోతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… తాజాగా సంగీత పై కేసు ఫైల్ అయ్యింది. ఆ కేసు పెట్టింది మరెవరో కాదు.. స్వయానా సంగీత తల్లి కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. సంగీత తల్లి పేరు భానుమతి. ఈమె స్థానిక వలసరవాక్కంలో నివసిస్తుంది. ఆ ఇల్లు తన మామగారి నుండీ ఆమెకి వచ్చింది. ఇంట్లో కింద భాగంలో సంగీత తల్లి భానుమతి నివసిస్తుండగా.. పైభాగంలో నటి సంగీత తన భర్తతో కలిసి జీవిస్తుంది. ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతోనే ఉంది. దీంతో తన ఇంటిని వదిలిపొమ్మని సంగీత తన తల్లి పై ఒత్తిడి తెస్తుందట. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న భానుమతి తమిళనాడు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

సంగీత ఇంటిని తన అన్నయ్య, తమ్ముడు ఆక్రమిస్తారనే భయంతో ఇలా ఇల్లు వదిలిపొమ్మని చెప్పినట్టు ఆమె పేర్కొంది. అయితే సంగీత తమ్ముడు మరణించాడు. భానుమతి వయసు పై బడడంతో బయటకి వెళ్ళే పరిస్థితుల్లో లేదు. దీంతో ఎక్కడకి వెళ్లాలంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం పై తన వివరణ ఇవ్వాలని సంగీతకు మహిళా కమిషన్ నోటీసులు పంపింది. వెంటనే సంగీత తన భర్తతో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. తరువాత ఈ విషయానికి సంబంధించి మీడియా ఆమెని ప్రశ్నించగా.. తన వ్యక్తిగత విషయాల గురించి బదులివ్వను, సినిమాల గురించి కావాలంటే అడగండి చెప్తాను అంటూ ఆమె బదులివ్వడం అందరినీ షాక్ కు గురి చేసింది. మరి ఈ వ్యవహారం చివరికి ఎటు దారితీస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus