Kajal Aggarwal: అజయ్ దేవగణ్ తో కాజల్ రొమాన్స్!

  • June 10, 2021 / 02:30 PM IST

సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు పెద్దగా రావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టాలెంట్ ఉన్న హీరోయిన్లకు పెళ్లి తరువాత కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న కాజల్ చేతిలో ఇప్పటికే ‘ఆచార్య’, ‘ఇండియన్ 2’ సినిమాలున్నాయి. వీటితో పాటు నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రానున్న సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూడు సినిమాలు కాకుండా బాలీవుడ్ లో ‘ఉమ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతుంది.

ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. తమిళం, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారట. నిజానికి ‘ఖైదీ’ సినిమాలో హీరోయిన్ పాత్ర కనిపించదు. హీరో భార్య చనిపోయినట్లు మాటల్లో చెబుతారే కానీ తెరపై ఎక్కడా చూపించరు. అయితే సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసినప్పుడు కొన్ని మార్పులు చేస్తుంటారు.

బహుశా ఈ స్టోరీలో కూడా మార్పులు చేసి హీరోయిన్ పాత్రతో ఓ ఫ్లాష్ బ్యాక్ ను నడిపించబోతున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. అందుకే కాజల్ కి హీరోయిన్ రోల్ ఆఫర్ చేసి ఉంటారు. గతంలో కాజల్, అజయ్ దేవగణ్ కలిసి ‘సింగం’ సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది. మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అయింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus