మెగాస్టార్ చిరంజీవికి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం కొత్తేమి కాదు. కానీ తొమ్మిదేళ్లుగా చిత్రపరిశ్రమకు దూరమైనా చిరుకి అదే ఆదరణ లభిస్తుందా? అని చాలా మంది సందేహించారు. వాటన్నింటినీ బాస్ ఒకే ఒక దెబ్బతో పటాపంచలు చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఆయన నటించిన ఖైదీ నంబర్ 150 బుధవారం విడుదలై ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కలక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన తొలిరోజే అనేక రికార్డులను బీట్ చేసింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి పేరిట ఉన్న రికార్డును తునాతునకలు చేసింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ తొలిరోజు 35.75 కోట్ల షేర్ ని రాబట్టింది. ఒకటిన్నర ఏడాదిగా ఆ రికార్డును ఏ తెలుగు చిత్రం బ్రేక్ చేయలేదు. నిన్న రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 మూవీ ఒక్కరోజే 39 కోట్ల షేర్ ని వసూల్ చేసి మెగాస్టార్ సత్తా చాటింది. చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత వచ్చినా ఆయనకున్న ఫాలోయిన్ పెరిగింది తప్ప, తగ్గలేదని ఈ రికార్డ్ నిరూపించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.