నందమూరి అభిమానులు రచ్చ లేపుతున్నారు…ఎక్కడా అవతలవారిని మాట్లాడకుండా చేస్తున్నారు….ఇంతకీ విషయం ఏమిటంటే..టాలీవుడ్ లో దాదాపుగా 9ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు…ఇక అదే క్రమంలో అదే సంక్రాంతి బరిలో నందమూరి నట సింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం సైతం ఉండడంతో ఈ ఇద్దరు మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ భారీగానే నెలకొంది….ఇక అదే క్రమంలో ఈ నెల 11న విడుదలైన చిరు 150వ మూవీ తొలి రోజు మిక్స్డ్ టాక్ సమాపాదించుకుంది…ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ కావడంతో సినిమాకి ఓపెనింగ్స్ సూపర్ గా వచ్చాయి….అయితే బాలయ్య సినిమా 12న విడుదల కావడం బ్రహ్మాండమైన హిట్ అందుకోవడంతో చిరుకి రెండో రోజు కలెక్షన్స్ కాస్త ఇబ్బంది పెట్టేలా వచ్చాయి…అదే క్రమంలో అనుకోకుండా కాస్త కన్ఫ్యూషన్ వాతావరణం క్రియేట్ చెయ్యడానికి అల్లు ఆరవింద్ చిరు 150వ సినిమా తొలి రోజు రికార్డ్ కలెక్షన్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలపడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయ్యింది…అదే క్రమంలో ‘ఖైదీ’ కి సంబంధించి వస్తున్న కలక్షన్స్ వార్తలు అన్నీ యదార్దాలు కావు అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారానికి తెర తీసారు.
నందమూరి అభిమానుల అభిప్రాయం ప్రకారం ‘ఖైదీ’ హవా కేవలం ఆసినిమా విడుదలైన మొట్టమొదటిరోజు మాత్రమే ఉందని ఆ సినిమా రెండవ రోజునుండి కలక్షన్స్ ఇంచుమించు సగానికి సగం పడిపోయాయి అని వాదిస్తున్నారు. అంతేకాకుండా…‘ఖైదీ’ మొట్టమొదటిరోజు కలక్షన్స్ విషయం బయటకు చెప్పారు కాని ఈసినిమా సంబంధించి రెండవరోజు మూడవరోజు కలక్షన్స్ పరిస్థితి ఎందుకు బయటకు చెప్పడంలేదు అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చిరంజీవి సినిమాలకు గుండెకాయ లాంటి బిసి సెంటర్లలో ‘ఖైదీ’ కి కలక్షన్స్ విషయంలో ఎదురీత ప్రారంభం అయింది అన్న విషయం యదార్ధం కాదా ? అని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు ‘ఖైదీ’ కలక్షన్స్ కు సంబంధించి ఒక ప్రముఖ ఫిలిం విశ్లేషకుడు పోస్ట్ చేసిన ట్విట్ కొద్ది గంటలలోనే ఎందుకు తొలగించాడు అన్న ప్రశ్నను నందమూరి అభిమానులు వేస్తున్నారు. ఇవన్నీ ఒప్పుకోక తప్పని నిజాలైన మొత్తానికి సోషియల్ మీడియా షేక్ అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.